Moviesఎందుకు పనికి రాద‌నుకున్న రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది... సీనియ‌ర్ హీరోయిన్...

ఎందుకు పనికి రాద‌నుకున్న రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది… సీనియ‌ర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌..!

రోజా… దశాబ్దకాలంకి పైగా హీరోయిన్ గా నటించి ఎందరి మనసుల్లోనో స్థానం సంపాదించుకొని ఆ తర్వాత రాజకీయ నాయకురాలిగా, జబర్దస్త్ జడ్జిగా, ప్రస్తుతం మంత్రిగా, ఒక రెబల్ స్టార్‌గా తనదైన ప్రత్యేకతతో యావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు మారిపోయారు. రోజా హీరోయిన్ గా నటించి ప్రస్తుతం మంత్రిగా సాగే వరకు ఆమె జీవితం ఏమీ పూలపాన్పు కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.

పెళ్లి జీవితంలోను, సినిమా జీవితంలోనూ ఆమె అనేక కష్టనష్టాలను ఓర్చుకుంది. ప్రస్తుతం సాఫీగా సాగుతున్న ఆమె జీవితం వెనక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు కూడా ఉన్నాయి. అయితే అన్నిటి వెనక తన కుటుంబం సపోర్ట్ ఉండటంతో ఆమె ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ గా కొనసాగుతోంది. అసలు రోజా చిన్నతనంలో ఇలా ఉండేది కాదు. రోజు తండ్రి నాగరాజా రెడ్డి తిరుపతి కార్పొరేషన్ లో ఉద్యోగం చేసేవారు. ఆమె జీవితంలో జరిగిన ఒక సరదా సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజా తండ్రి కార్పొరేషన్ లో పనిచేస్తున్న సమయంలో నటి కృష్ణవేణితో దగ్గరి స్నేహం ఉండేది. అప్పుడప్పుడు తన కూతుర్ని తీసుకొని నటి కృష్ణవేణి రోజా వాళ్ల ఇంటికి అలాగే కార్పొరేషన్ ఆఫీస్ కి కూడా వెళుతూ ఉండేది. అదే సమయంలో రోజాతో కృష్ణవేణికి మంచి పరిచయం ఉంది. అంతేకాదు కృష్ణవేణి కూతురుతో కూడా రోజాకి స్నేహం ఉండేది. ఇద్దరు కలిసి ఆడుకునేవారు. రోజా చాలా అల్లరి పిల్ల అసలు చెప్పిన మాట వినేది కాద‌ట‌. ఆమె చేసే అల్లరితో విసిగిపోయిన రోజా తండ్రి కృష్ణవేణి కూతుర్ని చూసి ముచ్చట పడేవారు.

సరదాగా నీ కూతుర్ని నాకు ఇచ్చేసేయ్ నా కూతురు నీకు ఇస్తాను.. ఈమె అల్లరి పడలేకపోతున్నానంటూ చెప్తూ ఉండేవారట కృష్ణవేణితో. ఆ సమయంలో రోజా అంత అందంగా ఏమీ ఉండేది కాదట. చాలా పీలగా చామన చాయతో ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉండేదట. కట్ చేస్తే కృష్ణవేణికి ఒక రోజు షూటింగ్ ఉందని హడావిడిగా సెట్ కు వెళ్లిందట. అక్కడ రోజా తండ్రి నాగరాజు రెడ్డి గారు కలిశారట. దాంతో కృష్ణవేణి నటిస్తున్న సినిమాలో రోజానే హీరోయిన్ అని తెలిసింది. అసలు ఈమె హీరోయిన్ ఎలా అయిందా అని కృష్ణవేణికి సందేహం మొదలైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news