Moviesవాళ్లందరు పనీపాటా లేని బ్యాచ్..అదేంటి రవితేజ అలా అనేశాడు..?

వాళ్లందరు పనీపాటా లేని బ్యాచ్..అదేంటి రవితేజ అలా అనేశాడు..?

సినీ ఇండస్ట్రీలో గాసిప్ లు కామన్..చిరంజివీ లాంటి బడా హీరో పైనే పుకార్లు స్ప్రెడ్ అయ్యి..ఆయనే వివరణ ఇచ్చుకున్న రోజులు ఉన్నాయి. ఇక చిన్న హీరోలు ఎంత..?. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. మాస్ మహా రాజ రవితేజ.. కి తలపోగరు ఎక్కువైందని..ఆయన నిర్మాతలకు తెగ కండీషన్లు పెడుతున్నారని..అస్సలు గత కొంతకాలంగా హిట్ పడని హీరో కి అంత బిల్డప్ ఎందుకని..వామ్మో, ఒకటా రెండా..బోలెడు..చాలా విషయాలను బయటకి తవ్వరు గాసిప్ రాయళ్లు.

మరీ ముఖ్యంగా డబ్బు కోసం ఎంతకైన దిగజారిపోతాడని..లేకపోతే ఈ వయసులో ఈ ముద్దులేంటి అంటూ జనాలు తిట్టిపోశారు. మరో పక్క రవి తేజ ఫ్యాన్స్ మాత్రం ఆయనను సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఈసారి మా అన్న ఎలాగైన హిట్ కొడతాడు అంటూ..బల్ల గుద్ది చెప్పుకొచ్చారు. అఫ్ కోర్స్..రీసెంట్ గా ఆయన హీరో గా నటిస్తున్న సినిమా” రామారావు ఆన్ డ్యూటీ” ట్రైలర్ కూడా అలానే ఉంది. రవితేజ ని ఇడియట్ రోజులు గుర్తు చేస్తున్నాయి. మాస్ డైలాగ్స్ లతో రెచ్చిపోయారు రవి తేజ.

అయితే, ఈ సినిమా విషయం లో రెమ్యునరేషన్ కోసం నిర్మాతకి చుక్కలు చూయించాడు రవి తేజ అంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ ..”నిర్మాత సుధాకర్ చెరుకూరితో రెమ్యూనరేషన్ విషయంలో సమస్య ఉందనే వార్తల గురించి ప్రశ్నించగా.. అలాంటిది ఏం లేదని..ఇండస్ట్రీలో అలా ఎవ్వరు లేరని..పని పాట లేని బ్యాచ్ ఉంది. వారికి ఏ పని ఉండదు..ఇలా ఎలాంటి పని లేదు కాబట్టి చెత్త గా రాస్తుంటారు.

వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని” రవితేజ చెప్పుకొచ్చారు. మరి, ‘ఖిలాడి’ సినిమా సమయంలో దర్శకుడికి రవితేజ కు మధ్య ఇన్నర్ ఫైట్ అయ్యిందని..వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ రాజా స్పీచ్ కూడా ఓ రేంజ్ లో ఉన్నింది. అయితే అప్పుడు సైలెంట్ గా ఉన్న రవితేజ ఇప్పుడు ‘రామారావు ఆన్ డ్యూటీ’ విషయంలో మాత్రం ఫైర్ అవుతున్నారు ఏంటి..అంటే అప్పుడు రాసిన వార్తలు నిజమేగా..ఆయనతో మీకు గొడవలు ఉన్నాయిగా అంటూ..నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి రవితేజ ఆన్సర్ ఇస్తాడా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news