Moviesబిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు దుమ్ము రేపిన రేటింగ్‌..!

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు దుమ్ము రేపిన రేటింగ్‌..!

తెలుగు బుల్లితెర పాపుల‌ర్ షో బిగ్‌బాస్ 5వ సీజ‌న్ ఇటీవ‌ల ముగిసింది. తెలుగు స్మాల్ స్క్రీన్‌పై ఈ షోకు మాంచి పాపులార్టీ వ‌చ్చింది. అయితే అనుకున్న స్థాయిలో క్రియేటివి లోపించ‌డంతో పాటు స‌రైన కంటెస్టెంట్లు లేకపోవ‌డంతో ఇటీవ‌ల ముగిసిన ఐదో సీజ‌న్ అనుకున్న స్థాయిలో ఆక‌ట్టుకోలేద‌న్న విమ‌ర్శ‌లు అయితే ఉన్నాయి. గ‌త సీజ‌న్ల‌తో పోలిస్తే ఎందుకో ఈ సారి సీజ‌న్ చాలా చ‌ప్ప‌గా సాగింది. చివ‌ర‌కు నాగార్జున వ‌చ్చిన‌ప్పుడు వీకెండ్స్‌లో కూడా అనుకున్న స్థాయిలో ఎపిసోడ్లు పేల‌లేదు.

చివ‌ర‌కు ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ కూడా ముందుగా లీక్ అయిపోవ‌డం.. ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ మిస్ అవ్వ‌డం జ‌రిగింది. అయితే గ్రాండ్ ఫినాలే మాత్రం చాలా అట్ట‌హాసంగా ముగిసింది. గ్రాండ్ ఫినాలే స‌క్సెస్ చేయ‌డంలో బిగ్‌బాస్ టీం స‌క్సెస్ అయ్యింది. ఎంద‌రో సెల‌బ్రిటీల‌ను ఈ ఫినాలేకు తీసుకువ‌చ్చారు. ఏకంగా బాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా ఈ ఫినాలేకు వ‌చ్చి ఆశ్చ‌ర్య ప‌రిచారు.

భారీ హంగామా మ‌ధ్య‌లో ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ సన్నీ – షన్ను దగ్గరకి వచ్చేసరికి మరింత టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క్రియేట్ అయ్యింది. ఇంత ఎగ్జైట్మెంట్ ఎపిసోడ్‌లో స‌న్నీ విన్న‌ర్‌గా నిలిచాడు. ఇక ఈ ఎపిసోడ్‌కు 18.4 రేటింగ్ వ‌చ్చింద‌ట‌. గ‌త ఐదు సీజ‌న్ల ఫైన‌ల్స్‌తో పోలిస్తే ఇది టాప్ – 3లో నిలిచింది. ఓవ‌రాల్‌గా ఈ సీజ‌న్ కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news