Moviesబిగ్‌బాస్ స‌న్నీకి ఆ అమ్మాయితో పెళ్లి.. క‌ట్నం ఎన్ని కోట్లో తెలుసా..!

బిగ్‌బాస్ స‌న్నీకి ఆ అమ్మాయితో పెళ్లి.. క‌ట్నం ఎన్ని కోట్లో తెలుసా..!

తెలుగు బిగ్‌బాస్ 5 సీజ‌న్ విన్న‌ర్ అయ్యాక వీజే స‌న్ని ఇప్పుడు తెలుగు నాట ఫుల్ పాపుల‌ర్ అయిపోయాడు. అటు మీడియాతో పాటు ఇటు సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా స‌న్నీ గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. స‌న్నీ హ‌వా మామూలుగా లేదు. ఓ వైపు వ‌రుస ఇంట‌ర్వ్యూలు, మరోవైపు అభిమానుల‌ను క‌ల‌వ‌డం, ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌డంతోనే మ‌నోడి టైం స‌రిపోతోంది. స‌న్నీ ఇంకా విన్నింగ్ మూమెంట్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

 

ఇక స‌న్నీకి ఒక‌టి రెండు సినిమాల్లో కూడా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఏదేమైనా బిగ్‌బాస్ స‌న్ని లైఫ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేసింద‌నే చెప్పాలి. చివ‌ర‌కు అత‌డికి పెళ్లి సంబంధాలు కూడా విప‌రీతంగా వ‌చ్చేస్తున్నాయ‌ట‌. ఎవ‌రికి వారు మా అమ్మాయిని చేసుకోవాలి.. కాదు మా అమ్మాయిని చేసుకోవాల‌ని ఒత్తిడి చేస్తున్నార‌ట‌. ఒక ఎన్నారై మ‌హిళ అయితే నా కూతురిని చేసుకో అని వీడియో కాల్ చేసి తెగ ఇబ్బంది పెట్టేస్తోంద‌ట‌.

స‌ద‌రు మ‌హిళ త‌న కుమార్తెను చేసుకుంటే రు. 100 కోట్ల క‌ట్నం ఇస్తాన‌ని కూడా బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. ఆ ఎన్నారై మ‌హిళ స‌న్నీకి వీరాభిమాని అట‌. స‌న్నీతో మాట్లాడేందుకు కాల్ చేసింద‌ట‌. మాట‌ల సంద‌ర్భంలో పెళ్లి ప్ర‌స్తావ‌న రావ‌డంతో మా కూతురు ఫొటోలు పంపిస్తాను.. మాకున్న రు. 100 కోట్ల ఆస్తి నీకే ఇచ్చేస్తాను.. అని తెగ ఇబ్బంది పెట్టేసింద‌ట‌.

అయితే స‌న్నీ మాత్రం షాక్ అయినా ఆ ఆఫ‌ర్‌ను సున్నితంగానే తిర‌స్క‌రించేశాడ‌ట‌. అయితే జ‌నాలు మాత్రం రు. 100 కోట్ల ఆఫ‌ర్‌.. ఎన్నారై సంబంధం అంటే మామూలు విష‌యం కాద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఏదేమైనా స‌న్నీ క్రేజ్ ఎలా పెరిగిందో చెప్పేందుకు ఇది నిద‌ర్శ‌నం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news