Moviesగోవా బీచ్‌లో స‌మంత బికినీ యోగా... పిచ్చెక్కించేస్తోందిగా..!

గోవా బీచ్‌లో స‌మంత బికినీ యోగా… పిచ్చెక్కించేస్తోందిగా..!

భారతదేశవ్యాప్తంగా సమంత – నాగచైతన్య జోడి ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమాతోనే ఈ జంట ఎంతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఏడు ఎనిమిది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ప్రేమించుకున్న వీరు 2013లో పెళ్లి చేసుకున్నారు. దేశంలోనే సినిమారంగంలో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరిద్దరూ 4 నెలల క్రితం విడిపోయి పెద్ద షాక్ ఇచ్చారు. వీరు విడిపోవడం అనేది ఎప్పటికీ సినిమా జ‌నాలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరికి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.

విడిపోయిన రోజు నుంచి ప్రతి రోజు కూడా వీళ్ళ గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. చైతు సైలెంట్ గా ఉన్నా స‌మంత మాత్రం ప్రతిరోజు ఏదోలా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇక విడాకుల తర్వాత బాగా ఎంజాయ్ చేస్తోంది. ఒకవైపు వరుసపెట్టి సినిమాల్లో నటిస్తూనే… మరోవైపు విహార యాత్రలకు వెళ్లి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు వ‌రుస‌పెట్టి సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బోల్డు పాత్రలో అయినా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. సమంత ప్రస్తుతం తన స్నేహితులైన శిల్పారెడ్డి – వాసుకితో కలిసి గోవాలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె గోవా బీచ్‌లో బికినీ వేసుకుని యోగా చేస్తోన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అవి అసలు చూస్తుంటే పిచ్చెక్కిపోయేలా ఉన్నాయి. స‌మంత‌కు అస‌లు పెళ్ల‌య్యిందా ? లేదా ఆమె యంగ్ హీరోయినా ? అన్న సందేహాలు వ‌స్తున్నాయి.

స‌మంత ఇటీవ‌ల బ‌న్నీ హీరోగా వ‌చ్చిన పుష్ప సినిమాలో ఊ అంటావా ఐటెం సాంగ్‌లో న‌టించింది. ఈ సాంగ్‌లో ఆమె చేసిన ర‌చ్చ మామూలుగా లేదు. ఈ ఐటెం సాంగ్‌తో సినిమాకు కూడా మంచి క్రేజ్ వ‌చ్చింది. మ‌రోవైపు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శాకుంత‌లం సినిమాలో కూడా న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news