Moviesవిజ‌య్ దేవ‌ర‌కొండ వేసుకున్న టీ ష‌ర్ట్ ధర తెలిసి స్టన్ అవుతున్న...

విజ‌య్ దేవ‌ర‌కొండ వేసుకున్న టీ ష‌ర్ట్ ధర తెలిసి స్టన్ అవుతున్న అభిమానులు..ఎందుకో తెలుసా..?

టాలీవుడ్‌లో చిన్న చిన్న క్యారెక్ట‌ర్ల‌తో ఎంట్రీ ఇచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. నాని ప‌క్క‌న ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమాలో నటించాడు. విజ‌య్‌కు ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందం సినిమాల‌తో విజయ్ కెరీర్ ఎక్క‌డికో వెళ్లిపోవ‌డం ఒక ఎత్తు అయితే. ఈ సినిమాల క‌లెక్ష‌న్ల‌తో పాటు విజ‌య్ యాట్యిట్యూడ్‌కు యూత్‌లో విప‌రీత‌మ‌న క్రేజ్ రావ‌డంతో టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు, స్టార్ హీరోలు సైతం షాక్ అవ్వాల్సిన ప‌రిస్థితి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి లైగర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర ట్రై చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండా..”రౌడీ బాయ్స్” అనే సినిమా లోని సాంగ్ రిలీజ్ ఈవేంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా నటించిన చిత్రం ‘రౌడీబాయ్స్‌’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌.

శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. ‘ప్రేమ ఆకాశమైతే…’ అంటూ సాగే ఈ పాటే యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశాడు. ఇక ఈ ఈవెంట్ లో ఆయన వేసుకున్న టీ షర్ట్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. విజయ్ ‘జీరో టాలరెన్స్ గ్యాంగ్‌స్టర్ స్వెట్ టీషర్ట్‌లో క్యూట్‌గా కనిపించాడు. ఇండియాలో దీని రేటు రూ.10, 500. అంత రేటున్న టీ ష‌ర్ట్ విజ‌య్ ధ‌రించాడ‌ని తెలిసి ఆయ‌న అభిమానులు స్ట‌న్ అవుతున్నారు. ఇక స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన విజయ్ దేవరకొండ ఓ బట్టల దుకాణం కూడా రన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ఇటీవలే ‘ఏవీడీ’ అనే మల్టీప్లెక్స్ ను కూడా లాంచ్ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news