Moviesకొత్త ప్ర‌పంచంలోకి అడుగుపెట్టబోతున్న లోకనాయకుడు..క‌మ‌ల్‌హాస‌న్‌ సంచలన నిర్ణయం..!!

కొత్త ప్ర‌పంచంలోకి అడుగుపెట్టబోతున్న లోకనాయకుడు..క‌మ‌ల్‌హాస‌న్‌ సంచలన నిర్ణయం..!!

క‌మ‌ల్‌హాస‌న్‌ ..ఈ పేరు గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఆయన అంత మంచి పేరు తెచ్చుకున్నారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన..ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. నాలుగేళ్ల వయసు లోనే ఆయనకు మంచి హిట్ వచ్చింది. ఇక అక్కడి నుంచి హీరోగా ఎన్నో ఎత్తు పల్లాలను కమల్ చూసారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఆయన మాత్రం తన సినీ కెరీర్ విషయంలో ఆ ప్రభావం లేకుండా సినిమాలు చేసారు. ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు కమల్. నిర్మాతగా దర్శకుడిగా కూడా ఆయన రాణించారు.

సినీ రంగంలో విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కమల్ హాసన్. ఆయన ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో అడుగుపెట్టారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీ పెట్టి ఆయన తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీకి దిగారు. అయితే… ఈ ఎన్నికల్లో తొలుత ముందంజలో కనపడిన కమల్ హాసన్.. అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కమల్ హాసన్ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

విలక్షణ నటుడు క‌మ‌ల్‌హాస‌న్‌.. ఫ్యాష‌న్ రంగంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు అనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అటు సినిమాలో ..ఇటు రాజకీయాల్లో సతా చాటిన కమల్ ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో త‌న మార్కును చూపించేందుకు సిద్ద‌మయ్యాడు . హౌస్ ఆఫ్ ఖ‌ద్ద‌ర్ పేరుతో ఫ్యాష‌న్ లేబుల్‌ను క‌మ‌ల్‌హాస‌న్‌ లాంఛ్ చేయ‌బోతున్నాడ‌ని కోలీవుడ్ మీడియా నుండి వార్తకు వినిపిస్తున్నాయి. భారతీయ చేనేత వ‌స్త్రాలు, ఇత‌ర వ‌స్తువుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే ల‌క్ష్యంతో మొద‌టి స్టోర్‌ను అమెరికా లోని చికాగో లో ప్రారంభించ‌నున్నారట ఈయన. ఈ క్లాతింగ్ లైన్ ను ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అమృతారామ్ రూపొందించిన్నట్లు య్తెలుస్తుంది. మరి చూడాలి ఈ రంగంలో కూడా కమల్ సక్సెస్ అవుతాతా..? లేదా..? అనే విషయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news