Gossipsమొండి చేస్తున్న ప్రభాస్.. ఆ బేబీనే కావాలట..?

మొండి చేస్తున్న ప్రభాస్.. ఆ బేబీనే కావాలట..?

డార్లింగ్‌’ ఈ పేరు వినగానే సినీ అభిమానులకు గుర్తొచ్చే పేరు ప్రభాస్‌. తనతో … కాదు, యావత్‌ తెలుగు సినీ ప్రేక్షకులతో ‘​డార్లింగ్‌’ అనిపించుకున్నారు ప్రభాస్‌. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇండియా లెవల్ లో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రభాస్ నుండి వచ్చే ప్రతి సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ సినిమాలే. ఒకరకంగా బాలీవుడ్ హీరోలకు సమానంగా.. అంతకు మించి దక్షణాదిలో కూడా భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోగా ప్రభాస్ ఇప్పుడు మంచి జోరు మీదున్నాడు.

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కె టెంటేటివ్ అనే మూవీ కూడా చేస్తున్నారు.

అయితే భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతికతో తెరకెక్కించాల్సిన సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. అందుకే ప్రభాస్ లైనప్ లో ప్లేస్ మార్చుకుని ”ప్రాజెక్ట్ K” గా వచ్చి చేరింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో అమితాబ్ పై కొన్ని సీన్స్ నని షూట్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో అక్కినేని కోడలు సమంత నటించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఒక కీలకమైన పాత్ర కోసం సమంతను అప్రోచ్ అవ్వగా.. ఆమె వెంటనే ఓకే చేసినట్లు సినీ వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో మలయాళ టాప్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తాడని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే..మంచి క్రేజ్ ఉన్న సమంత, పృథ్వీరాజ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుంటే ప్రాజెక్ట్ కె గ్రాఫ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

Latest news