Movieskarthika Deepam: ఈ భాగ్యం బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!!

karthika Deepam: ఈ భాగ్యం బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!!

కార్తీక దీపం.. ఈ సిరియల్ గురిచి ఎంత చెప్పినా తక్కువే. రాత్రి 7;30 అయ్యిందంటే చాలా ఇళ్లలోని ఆడవాళ్లు.. పనులని ముగించుకుని ఈ సీరియల్ కోసం టీవీల ముందు అతుక్కుపోతారు. అంతలా బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు వస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ వచ్చినా, తుఫాన్‌లు వచ్చినా.. భూకంపాలు వచ్చినా వంటలక్క హవా మాత్రం తగ్గేదేలే అంటూ టాప్ టీ ఆర్ ఫిలతో దూసుకుపోతుంది..

కరోనా సీజన్ లోనూ ఈ సీరియల్ తన టీఆర్పీతో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే.. అది కేవలం కార్తీకదీపం సీరియల్ మాత్రమే అని చెప్పవచ్చు. ఆ సీరియల్‌తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాకుండా సెలబ్రిటీలకు కూడా అభిమాన సీరియల్ గా మారింది. ఇక ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది.

ఇక కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్క సవతి తల్లి భాగ్యం అలియాస్ ఉమ చేసే కామెడీ భలే గమ్మత్తుగా ఉంటుంది. మురళీక్రిష్ణ భార్యగా ఆమె చేసే పనులు నవ్వు పుట్టిస్తాయి. సీరియల్ మొత్తం ఏడుపే బాబోయ్ అనుకునేవాళ్లు భాగ్యం వచ్చిన ప్రతిసారి నవ్వుకుంటారు. ఇక జీ తెలుగులో వచ్చే ప్రేమ ఎంత మధురం సీరియల్‌లో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉన్న రోల్‌లోనే కనిపిస్తుంది. ఇక సీరియల్‌లో సైతం నటిస్తూ బిజీ నటిగా మారింది ఉమా దేవి.

ఈమె అసలు పేరు ఉమాదేవి. సెయింట్ మేరీ స్కూల్,అన్నామలై యూనివర్సిటీలలో చదువుకున్న ఉమాదేవికి చిన్ననాటి నుంచి యాక్టింగ్,డాన్సింగ్ అంటే చాలా ఇష్టమట. చదువు పూర్తి అయ్యాక యాక్టింగ్ ఫీల్డ్ లో కొనసాగాలని భావించి.. వరూధిని పరిణయం సీరియల్ తో బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చి.. తన యక్టింగ్ తో అదరగొట్టేసి..బెదరగొట్టేసింది. ఆ తరువాత ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చిందట. ఇక ఈమె తన పిల్లలు అండగా ఉండడం వలనే ఇండస్ట్రీలో ఉంటున్నానని ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది. ఈమె వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అర్జున్ రెడ్డి,ఖతర్నాక్, సై, గిలిగింతలు,అత్తిలి సత్తిబాబు, అబ్బాయి ప్రేమలో పడ్డాడు,యమదొంగ నేను వంటి మూవీస్ లో నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news