Newsపెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి పూర్ణ.. వరుడు ఎవరో తెలుసా..?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి పూర్ణ.. వరుడు ఎవరో తెలుసా..?

పూర్ణ.. బహుసా ఈ పేరు ఒక్కప్పుడు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ అమ్మడు పేరు చెప్పితే కుర్రకారు ఊగిపోతున్నారు. అంతలా తన అందం, తన అభినయంతో యూవతని కట్టిపడేసింది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ పూర్ణ. ఆమె అసలు పేరు షామ్నా ఖాసిమ్. పూర్ణ అవ్వడానికి మలయాళీ భామ అయిన.. తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ అలరిస్తోంది. పూర్ణ తెలుగులో ఎక్కువుగా దర్శకుడు రవిబాబు సినిమాల్లో నటించింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన అవును, లడ్డుబాబు, అవును 2.. వంటి సినిమాల్లో నటించి మంచి నటిగా పేరుతెచ్చుకుంది.

టాలీవుడ్ హీరోయిన్స్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు వారిలో పూర్ణ ఒకరు. ఈ అమ్మడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళీ భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది నటి పూర్ణ. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. కేవలం హీరోయిన్ గానే నటించాలనే ఆంక్షలు పెట్టుకోకుండా మంచి పాత్ర దొరికితే నటించడానికి సిద్ధం కావడంతో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్యూటీ విలన్ రోల్స్ చేయడానికి సిద్దమవుతుంది. నటనకు ప్రాధాన్యత ఉంటే నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటుంది.

 

తాజాగా నటి పూర్ణిమ ప్రధాన పాత్రలో కల్యాణ్‌ జీ గోగన డైరెక్షన్ ళి నటిస్తున్న చిత్రం “సుందరి”. ఈ సినిమా నిర్మాణ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దహంగా ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది.. కానీ కరోనా సెకండ్ వేవ్ రావడంతొ.. లాక్ డౌన్ విధించడంతో.. ధియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడ్డింది.ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో.. తిరిగి ధియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి.

ఈ క్రమంలో ఈ ” సుందరి” సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు. ఈ ఫోటోలో పూర్ణ పెళ్లి కూతురు గెటప్ లో ఎంతో చూడటానికి అందంగా ఉన్నారు. ఈ సినిమాలో ఎంతో అందంగా ఉన్నటువంటి పూర్ణిమకు తన అందమే శాపంగా మారింది. అయితే ఆమె జీవితం లో ఏం జరిగింది.. అనే కథాంశంతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.ప్రస్తుతం పెళ్లి కూతురు గెటప్ లో ఉన్నటువంటి నటి పూర్ణ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news