Moviesకేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్‌... సంబ‌రాలు స్టార్ట్ అయ్యాయ్‌..

కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్‌… సంబ‌రాలు స్టార్ట్ అయ్యాయ్‌..

సౌత్ ఇండియ‌న్ క్రేజీ సినిమా కేజీఎఫ్ ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చి కూడా రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు కేజీఎఫ్ 2 ఎప్పుడు వ‌స్తుందా ? అని సౌత్ సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల కేజీఎఫ్ 2 షూటింగ్ లేట్ అవ్వ‌డంతో ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది. మ‌రోవైపు కేజీఎఫ్ ను క‌న్న‌డ సినీ ప్రేక్ష‌కులు క‌న్న‌డ బాహుబ‌లితో పోల్చుకున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ 2 సైత కేజీఎఫ్‌ను మించిన హిట్ అవుతుంద‌ని ఆశ‌ల‌తో ఉన్నారు.

 

ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్ 2 ఇప్ప‌టికే బెంగ‌ళూరు షెడ్యూల్ పూర్తి చేసుకుని హైద‌రాబాద్ షెడ్యూల్లో బిజీ కానుంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ కేజీఎఫ్ 2 రిలీజ్‌డేట్‌ను త్వ‌ర‌లోనే ఫిక్స్ చేయ‌నుంద‌ని తెలుస్తోంది. అక్టోబ‌ర్ చివ‌రి వారంలో షూటింగ్ ఫినిష్ చేసి ఆ వెంట‌నే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కే ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14, 2021న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో య‌ష్‌, శ్రీనిధి శెట్టి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వీనా టండ‌న్, ప్ర‌కాశ్ రాజ్ లు కూడా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని హోమ‌బుల్ ఫిల్మ్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఏదేమైనా కేజీఎఫ్ 2 సంక్రాంతికి వ‌స్తుంద‌న్న అంచ‌నాల‌తో సంబ‌రాలు మామూలుగా లేవు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news