Moviesవాళ్ల‌కు ఓటు హ‌క్కు వ‌ద్దు... విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వాళ్ల‌కు ఓటు హ‌క్కు వ‌ద్దు… విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓటు హ‌క్కుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లిక్క‌ర్ కోసం ఓటును అమ్ముకునే వాళ్ల‌కు ఓటు హ‌క్కు లేకుండా చేయాల‌ని విజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. ప్ర‌ముఖ ఫిల్మ్ క్రిటిక్ భ‌ర‌ద్వాజ్ రంగ‌న‌న్‌, అనుప‌మ్ చోప్రాల‌తో జ‌రిగిన చాట్ సంద‌ర్భంగా విజ‌య్ మాట్లాడుతూ డ‌బ్బుల కోసం, మందుకోసం ఓటు అమ్ముకుంటూ… త‌మ ఓటు విలువ ఏంటో తెలియ‌ని వాళ్ల‌కు ఓటు హ‌క్కు ఉన్నా ఒక‌టే లేక‌పోయినా ఒక‌టే అని విజ‌య్ కామెంట్ చేశాడు.

అలాగే బాగా డ‌బ్బున్న వాళ్ల‌కు కూడా ఓటు హ‌క్కు వ‌ద్ద‌ని, చదువుకుని ఓటు హక్కు విలువ తెలిసిన మధ్యతరగతి వాళ్లకి మాత్రమే ఉండాలి అని పేర్కొన్నాడు. ఓటు హ‌క్కుపై విజ‌య్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారుతున్నాయి. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఫైట‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news