రాజ‌మౌళిపై ఆర్ ఆర్ ఆర్ టీం కంప్లెంట్‌… ఎన్టీఆర్ కూడా..

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంతో మంది సినీ, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబోలో ఆర్ ఆర్ ఆర్ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక మామూలుగానే బ‌ర్త్ డే అంటే విషెస్‌లు, ప్ర‌శంస‌లు, కీర్త‌న‌లు ఉంటాయి. అందులోనూ రాజ‌మౌళి బ‌ర్త్ డే అంటే సోష‌ల్ మీడియా ఎలా మార్మోగిపోతుందో ? అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

అయితే ఆర్ ఆర్ ఆర్ టీం మాత్రం రాజ‌మౌళికి చాలా వెరైటీగా విష‌స్ తెలిపింది. రొటీన్‌గా కాకుండా రాజ‌మౌళి నిబ‌ద్ధ‌త‌, సింప్లిసిటీ గురించి చెపుతూనే అత‌డిపై ఫిర్యాదులు చేస్తూ విష్ చేసింది. ఎన్టీఆర్ అయితే ఓ ప‌ట్టాన సంతృప్తి చెందే ర‌కం కాదు.. ద‌ర్శ‌క రాక్ష‌సుడు.. చెక్కుతూనే ఉంటాడ‌ని క‌సురుకుంటూ విష్ చేశాడు.

 

ఇక రామ్‌చ‌ర‌ణ్ అయితే ఓ సీన్ ఎలివేష‌న్ గురించి, యాక్ష‌న్ సీన్స్ విష‌యంలో రాజ‌మౌళి పెట్టే ఇబ్బందుల గురించి విసుక్కూంటూ విష్ చేశాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎంఎం. కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర సిబ్బంది కూడా రాజమౌళిపై సరదా సరదా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.