Moviesతండ్రి అయిన టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్‌

తండ్రి అయిన టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్‌

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వేళ వ‌రుస‌గా శుభ‌కార్యాలు జ‌రుగుతున్నాయి. కొంద‌రు హీరోలు పెళ్లిళ్లు చేసుకుంటే.. మ‌రి కొంద‌రు ఎంగేజ్మెంట్ జ‌రుపుకుంటున్నారు. ఇక హీరోయిన్ల పెళ్లిళ్లు కూడా అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రో టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ ఇంట్లో సంతోష‌క‌ర‌మైన వార్త చోటు చేసుకుంది. యంగ్ డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య ఈ రోజు తండ్రయ్యారు. శ్రీరామ్ సుధీర్‌బాబుతో భ‌లే మంచి రోజు, శ‌మంత‌క‌మ‌ణి, నాగార్జున – నానితో దేవ‌దాస్ లాంటి సినిమాలు తెర‌కెక్కించాడు. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను శ్రీరామ్ బాగా ప్ర‌జెంట్ చేస్తాడ‌న్న పేరుంది. శ్రీరామ్ ఆదిత్య తనకు కొడుకు పుట్టిన విష‌యాన్ని ఆదివారం ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు.

Tollywood director Aditya elopes with a bride

మా చిన్నారి వ‌చ్చేశాడు.. అడ్వెంచర్ మొదలవుతోంది. శ్రీరామ్ ఆదిత్య తుర్లపాటి… ప్రియాంక తుర్లపాటి అని తను షేర్ చేసిన పోస్టర్లో తెలిపాడు. ఇక శ్రీరామ్‌కు సోష‌ల్ మీడియాలో ప‌లువురు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ప్ర‌స్తుతం శ్రీరామ్ మ‌హేష్‌బాబు మేన‌ళ్లుడు గ‌ల్లా అశోక్ ( గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు) హీరోగా ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. నిధి అగ‌ర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news