Moviesఅనుష్క పోస్ట్‌కు కోహ్లీ సూప‌ర్ రియాక్ష‌న్‌... ఫ్యాన్స్ ఫిదా

అనుష్క పోస్ట్‌కు కోహ్లీ సూప‌ర్ రియాక్ష‌న్‌… ఫ్యాన్స్ ఫిదా

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌, స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ దంప‌తులు ( విరుష్క‌లు) త‌ల్లిదండ్రులు కాబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఇప్పటికే కోహ్లీ తెలియ‌జేశాడు. త్వ‌ర‌లోనే తాము ఇద్ద‌రం ముగ్గురుం కాబోతున్నామ‌ని చెప్పాడు . ఈ క్ర‌మంలోనే కోహ్లీ గ‌త నెల‌లోనే అనుష్క‌తో ఉన్న ఓ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డం.. దీనికి కోట్ల‌లో లైకులు, షేర్లు రావ‌డం జ‌రిగింది. ఈ ఫొటో ఆసియాడ్‌లోనే ఎక్కువ షేర్లు అయిన ఫొటోగా కూడా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

 

 

తాజాగా.. అనుష్క శర్మ మరో ఫోటోను తన అభిమనులతో పంచుకుంది. అనుష్క త‌న గ‌ర్భం చూస్తూ సంతోషంగా ఉన్న ఫొటో ఇన్‌స్టాలో షేర్ చేసింది. మీలో జీవిత సృష్టి అనుభ‌వించ‌డం కంటే మ‌రేమి నిజం కాద‌ని చెప్పింది.. దీనికి కోహ్లీ రిప్లే ఇస్తూ  నా ప్రపంచం మొత్తం ఒకే ఫ్రేంలో ఉందని చెప్ప‌డంతో పాటు హార్ట్ ఎమోజీ పెట్టాడు. దీంతో విరుష్క‌ల అభిమానులు ఈ పోస్టుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక 2017 డిసెంబ‌ర్లో ఈ జంట‌కు వివాహం జ‌ర‌గ‌గా వీరు త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులు కాబోతున్నారు.

 

 

 

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news