సమంతపై ఛార్మి సెన్సేషనల్ కామెంట్స్.. ఏ టైంలో పుట్టావంటూ..!

ఓ బేబీ అంటూ శుక్రవారం ప్రేక్షకులను పలుకరించిన సమంత అక్కినేని మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుందని చెప్పొచ్చు. నందిని రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కొరియన్ మూవీ మిస్ గ్రానీకి అఫిషియల్ రీమేక్ గా వచ్చింది. ఈ సినిమాలో సమంత నటనకు అందరు ఫిదా అవుతున్నారు. సీనియర్ నటి లక్ష్మికి ధీటుగా సమంత నటన సాగింది. కనిపించడానికి పడుచుపిల్లగా ఉన్నా ఆమె యాస భాష వేరుగా ఉంటాయి.

ఓ బేబీ చూసిన వారంతా సమంత నటనకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో సమంత గురించి ఛార్మి కూడా ఓ సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఏ టైంలో పుట్టావమ్మా నువ్వు.. నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్, నీ జాతకం కి నమస్కారం.. వెరీ హ్యాపీ నందిని రెడ్డి అండ్ టీం అంటూ ట్వీట్ చేసింది ఛార్మి. ఛార్మి కామెంట్స్ కు సమంత కూడా రిప్లై ఇచ్చింది.

యు ఆర్ ద క్యూటెస్ట్.. థ్యాంక్ యూ ఛార్మీ.. హుగ్స్ అండ్ కిస్సెస్ అంటూ సమంత రిప్లై ఇచ్చింది. అక్కినేని కోడలిగా మారిన తర్వాత సమంత కెరియర్ లో మరో కొత్త టర్న్ తీసుకుంది. యూటర్న్, మజిలీ, ఓ బేబీ ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఓ బేబీ సినిమాలో అయితే సమంత నట విశ్వరూపం చూపించిందని చెప్పొచ్చు. అనుకున్నట్టుగానే ఓ బేబీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. వసూళ్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment