పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు..!

తానా సభల్లో పాల్గొనేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ ద్విపాత్రాభినయం చేశారు. అదేంటి అనుకోవచ్చు.. సినిమా యాక్టర్ గానే కాదు జనసేన అధినేతగా పవన్ ప్రసంగం నడిచింది. రజిని, విజయ్ లతో పాటుగా సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ పవన్ కళ్యాణ్. అది అందరికి తెలిసిన విషయమే. ఆయన వస్తున్నాడంటే చాలు లక్షల మంది ప్రేక్షకులు వస్తారు. పార్టీ మీటింగులకు వచ్చే జనాలందరు తనకు ఓట్లేస్తారని అనుకోలేదని అన్నాడు పవన్ కళ్యాణ్.

జనసేన ఓటమి ముందు ఊహించిందే అని.. 15 నిమిషాల్లో ఆ విషయాన్ని మర్చిపోయానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కు గట్టి పంచ్ ఇచ్చారు. ఈవెంట్ జరిగేటప్పుడు కేకలు వేయడం.. తను ఏదైనా మాట్లాడితే వాటి మీద డిస్కషన్స్ పెట్టడం కన్నా ఆ టైం ను ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తే బెటర్ అని తన ఫ్యాన్స్ కు గట్టి పంచ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్.

తనకు ఓటమంటే భయం లేదని.. ఓడిపోవడానికి ఎన్ని కారణాలైనా చెప్పొచ్చు భయం ఉన్న వారే కారణాలు చెబుతారు. స్క్యాంలు చేసి తాను రాజకీయాల్లోకి రాలేదని తాను మనస్పూర్తిగా నమ్మిన ఈ మార్గంలో ఓడిపోయినా తనకు సంతోషమే అంటూ చెప్పారు పవన్ కళ్యాణ్. పవన్ స్పీచ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది.

Leave a comment