రష్మికకు ఆ ఛాన్స్ వచ్చింది.. ఇక రెచ్చిపోవడం ఖాయం..!

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో మంచి ఫాంలో ఉంది. ఛలో సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో జోడీ కడుతుంది రష్మిక. ఈ సినిమాతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా ఓకే చేసిన రష్మిక నితిన్ భీష్మ సినిమాలో నటిస్తుంది.

ఇక తెలుగులోనే కాదు ఈమధ్యనే కోలీవుడ్ లో కార్తి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక లేటెస్ట్ గా ఇళయదళపతి విజయ్ సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. విజయ్ 63వ సినిమా అట్లీ డైరక్షన్ లో బిగిల్ మూవీ చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ లోకేష్ కనకరాజు డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడట.

ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉండగా అందులో ఒక హీరోయిన్ గా రష్మికకు ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. రష్మిక తో పాటుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి రాశి ఖన్నా కు అవకాశం దొరికిందట. రాశి, రష్మిక ఇద్దరు తమిళ పరిశ్రమకు కొత్తే. స్టార్ హీరో సినిమాలో ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఇద్దరికి లక్కీ ఛాన్స్ వచ్చినట్టే లెక్క.

Leave a comment