Newsరకుల్ ఓ విడో.. సంచలనం సృష్టిస్తున్న వార్త..!

రకుల్ ఓ విడో.. సంచలనం సృష్టిస్తున్న వార్త..!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ విడో అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే టాలీవుడ్ లో అనతి కాలంలో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలలోనే అలరించింది. అయితే నటన పరంగా తాను కొత్త కథలను వెతుకుతున్న రకుల్ కు అలాంటి సరైన కథే దగ్గరకు వచ్చిందట.

ఆ సినిమాలో విడోగా రకుల్ డీ గ్లామర్ రోల్ చేసేందుకు ఒప్పుకుందట. ఓ విధంగా టాప్ రేంజ్ లో ఉన్న రకుల్ ఈ సినిమా చేయడానికి గట్స్ ఉండాలి. ఏదో గ్లామర్ షోతో కెరియర్ నడిపించేస్తున్న రకుల్ విడో పాత్ర అనగానే అభిమానులే షాక్ అవుతున్నారు. కంటెంట్ బేస్డ్ సినిమా కాబట్టి రకుల్ తను ఆ సినిమా చేయాలని ఒప్పుకుందట.

ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్న ఈ సినిమా గురించి త్వరలో అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ స్పైడర్, బెల్లంకొండ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న జయ జానకి నాయకా సినిమాల్లో నటిస్తున్న రకుల్ మరిన్ని ఆఫర్లు తన సొంతం చేసుకుంటుంది. మరి కెరియర్ లో మొదటిసారి ప్రయోగాత్మక సినిమా చేయబోతున్న రకుల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news