Newsకమల్ హాసన్ మీద పోలీసు కేసు!!

కమల్ హాసన్ మీద పోలీసు కేసు!!

ఈ మధ్య కాలం లో తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ .. ఆయన హీరోగా ఎన్ని సినిమాలో చేసిన ఏదో ఒక వివాదం లోంచి బయట పడితే గానీ ఆ సినిమా విడుదల కాదు అలాంటిది ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ లలో మాట్లాడిన మాటలు కూడా పిచ్చ కాంట్రవర్షియల్ అవుతున్నాయి. ఈ మధ్యన ప్రైవేటు ఛానల్ తో మాట్లాడిన ఆయన .. మహాభారతం గురించి చేసిన వ్యాఖ్యలు సీరియస్ అయ్యయి.ఈ వ్యాఖ్యలు భారతీయులు పంచమ వేదంగా భావించే మహాభారతానికి కళంకం తెచ్చేలా ఉందంటూ కన్యాకుమారి జిల్లా అంజు గ్రామానికి చెందిన హిందూ మక్కళ్ కట్చి కార్యకర్త.. 31 ఏళ్ల ఆదినాద సుందరం ఒక పిటీషన్ ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిశీలించిన వల్లియూరు కోర్టు విచారణకు స్వీకరించింది. నాస్తికవాదిగా ఉన్న కమల్ వ్యాఖ్యలు గర్హనీయమని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి కోరుతున్నారు. మరోవైపు హిందూమక్కళ్ కట్చి కార్యకర్తలు కమల్ పై చెన్నై పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేశారు. మాట్లాడే మాటలు ఆచితూచి మాట్లాడకుంటే లేనిపోని సమస్యలు వస్తాయన్నవిషయాన్ని కమల్ లాంటి వారు కూడా గుర్తించకపోవటం ఏమిటో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news