ఎన్టీఆర్ సినిమాకి పవన్ ప్రొడ్యూసర్..ప్రూఫ్ ఇదే..!

Pavan turns producer for ntr's next

ఎస్ రాధా కృష్ణ అలియాస్ చిన్న బాబు నిర్మాణ సంస్థా అయిన  హారిక & హాసిని క్రియేషన్స్ పై అనేక సినిమాలు నిర్మించారు సహా నిర్మాతగా కూడా చేసారు. అయితే వాటిలో ఎక్కువగా త్రివిక్రమ్ సినిమాలే ఉండటం గమనార్హం . ఈ నిర్మాణ సంస్థ యొక్క ఆఫీస్ లో కూడా త్రివిక్రమ్ పేరు రాగితో డైరెక్టర్ అని చెక్కి ఉంటుంది . అయితే ఈ పరిణామాలన్నీ చూస్తే హారిక & హాసిని క్రియేషన్స్  త్రివిక్రమ్ , రాధ కృష్ణ జాయింట్ వెంచర్ అనే అనుమానాలకు దారితీస్తుంది .

ఇప్పుడు మరో డౌట్ క్రియేట్ అవుతుంది ఇండస్ట్రీ వర్గాల్లో . ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి ఆడియో ఫంక్షన్స్, సినిమా ఓపెనింగ్స్  లాంటి ఈవెంట్స్ ఏది జరిగిన పవన్ కళ్యాణ్ పేరు బాగా వినబడుతుంది . నిన్న ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా మూహూర్తం షాట్  కు పవన్ క్లాప్ కొట్టడంతో ఆ అనుమానం మరింత బలపడింది . ఈ నిర్మాణ సంస్థలో పవన్  సీక్రెట్ గా ఇన్వెస్ట్ చేసారని అనుమానిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు .

నిజానికి సినిమాలకు స్వస్తి పలికి ఫుల్ టైం పాలిటిక్స్  లోకి అడుగు పెట్టె ఆలోచనలో వున్నారు పవన్ కళ్యాణ్ . ఇదే జరిగితే  పవన్ కి ఇన్కమ్ సోర్స్ ఉండే అవకాశం లేదు , పైగా పవన్ చాల సార్లు చెప్పారు తనకు  సేవింగ్స్ అసలు లేవని. నిజంగా ఆయన పెట్టుబడులు హారిక & హాసిని క్రియేషన్స్  లో పెడితే తనకి ఆర్ధిక ఇబ్బంది ఉండకపోవచ్చు .

పవన్ డైరెక్ట్ గ పెట్టుబడులు పెట్ట లేదని త్రివిక్రమే ఈ  జనసేన అధ్యక్షుడి ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటున్నారు అనేది కొంత మంది సినీ వర్గాల అభిప్రాయం . గతంలో సినిమాలు పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాలలోకి ఎంటర్ అయినా స్టార్స్ లో అమితాబ్, విజయ్ కాంత్ లాంటి వారి పరిస్థితి ఏమైందో మనందరికీ తెలిసిందే. ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి వీరికి . అందుకే పవన్ జాగ్రత్త వహిస్తున్నారని సినీ వర్గాల అభిప్రాయం.

సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ చర్చలకు దారితీస్తుంది . ఈ న్యూస్ నిజమైతే  పవన్ తప్పు చేస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు . సీక్రెట్ గా ప్రొడ్యూస్ చేయడం కన్నా అఫిషియల్ గా అనౌన్స్ చేసుంటే బావుండేదన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి . ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరో సినిమాకు ప్రొడ్యూసర్ అంటే ఆ సినిమాకు వచ్చే  క్రేజే  వేరప్పా.

More from my site