బయ్యర్ల పరిస్థితి ఏంటి? 6 వ రోజు కలెక్షన్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ. గత మూడు సంవత్సరాల నుంచి ఈ హీరొకి పెద్దగా కలిసి రావడం లేదనే చెప్పాలి. బెంగాల్ టైగర్ కాస్త పరవాలేదు అనిపించినా.. తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని పటాస్, సుప్రీమ్ లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు అనీల్ రాఘవపూడితో దిల్ రాజ్ నిర్మాతగా మెహ్రరీన్ హిరోయిన్ గా నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో దీపావళి స్పెషల్ గా బుధవారం ధియేటర్స్ కు వచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మూడవ సినిమాగా దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి సక్సెస్ ఫుల్ టాక్ వచ్చింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజులకు రూ. 34 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా ఏపీ, తెలంగాణలోనే రూ.18.73 కోట్ల షేర్ వసూలు చేసింది. రవితేజకు ఇవి కెరీర్ పరంగా బెస్ట్ వసూల్లుగా ఉన్నాయి. ఇక సినిమాకు పోటీ సినిమాలు లేకపోవడంతో పాటు రాజు గారి గది 2 బాక్సాఫీస్ వద్ద డల్ అవ్వడం ఈ సినిమాకు బాగా కలిసిరానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సేఫ్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.ఇదే విధంగా కలెక్షన్స్ రాబడితే బయ్యర్ల కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల అంచనా.

రాజా ది గ్రేట్ 5 డేస్ ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది…..
నైజాం – 6.95
సీడెడ్ – 2.95
ఉత్తరాంధ్ర – 2.29
వెస్ట్ – 1.21
ఈస్ట్ – 1.57
కృష్ణా – 1.42
గుంటూరు – 1.51
నెల్లూరు – 0.92
————————————
ఏపీ తెలంగాణ = 18.73 కోట్లు

 

Leave a comment