Gossipsఆహా.. అనుష్క గిఫ్ట్ చూసి ప్రభాస్ ఫిదా

ఆహా.. అనుష్క గిఫ్ట్ చూసి ప్రభాస్ ఫిదా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందరభంగా స్వీటీ అనుష్క ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇంతకీ అమ్మడు ప్రభాస్ కు ఏం గిఫ్ట్ ఇచ్చింది అంటే ప్రభాస్ ఇష్టం తెలుసుకుని అతనికి నచ్చే డిజైనర్ వాచ్ బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చిందట. అనుష్క గిఫ్ట్ కు ప్రభాస్ సర్ ప్రైజ్ అయ్యాడని తెలుస్తుంది.

స్వీటీ అనుష్క, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరి కాంబినేషన్ ఎన్నో సూపర్ హిట్లు అందించాయి. మొన్నామధ్య వీరిద్దరి చనువు చూసి ప్రభాస్ కు కాబోయే భార్య అనుష్కనే అన్న వార్తలు వచ్చాయి. వాటికి వీలు దొరికినప్పుడల్లా సమాధానం ఇస్తూనే వచ్చారు. ఇప్పుడు ప్రభాస్ కు ఎంతో ఇష్టమైన డిజైనర్ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వడంతో మళ్లీ ఇద్దరి మీద ఫోకస్ పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బర్త్ డే కానుకగా సినిమాలో ప్రభాస్ లుక్ రివీల్ చేశారు. అనుష్క భాగమతి సినిమా చేస్తుంది. డిసెంబర్ లో ఆ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news