Movies" శంభో శంకర " ట్రైలర్.. షకలక శంకర్ లోని రౌద్రరసం..!

” శంభో శంకర ” ట్రైలర్.. షకలక శంకర్ లోని రౌద్రరసం..!

జబర్దస్త్ నుండి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన షకలక శంకర్ హీరోగా చేస్తున్న మొదటి ప్రయత్నం శంభో శంకర. శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రమణా రెడ్డి, సురేష్ కొండేటి నిర్మించారు. శంకర్ సరసన కారుణ్య నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అలరిస్తుంది. ఇన్నాళ్లు షకలక శంకర్ లోని కామెడీనే చూశాం కాని అతనిలోని రౌద్రరసం ఈ సినిమాలో కనిపిస్తుంది.

శంభో శంకర కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో వస్తున్న ఈ కమెడియన్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. సాయి కార్తిక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా బాగుందనిపిస్తుంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ట్రైలర్ మాత్రం ఇంప్రెసివ్ గా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news