Gossipsఆ కష్టాలన్నీ ఎన్టీఆర్ ఒక్కడికే సాధ్యం..!

ఆ కష్టాలన్నీ ఎన్టీఆర్ ఒక్కడికే సాధ్యం..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అందుకోసం సినిమాకు ఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేస్తున్నారట. సినిమాలో తారక్ డబుల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా పూజా హగ్దె నటిస్తుంది.

ఇప్పటిదాకా 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం ఎన్.టి.ఆర్ రేయింబవళ్లు కష్టపడుతున్నాడట. ఈమధ్యనే మరోసారి తండ్రి అయిన తారక్ ఇంట్లో చంటి పిల్లాడు ఉన్నా అతని ప్రేమని మిస్ అవుతున్నా సరే సినిమా పూర్తి చేయాలనే ఉద్దేశంతో షూటింగ్ చేస్తున్నాడట. కొడుకు చేసే అల్లరి కేవలం రాత్రిల్లు మాత్రమే చూస్తున్నాడట. చాలా సందర్భాల్లో షూటింగ్ చేసుకుని వచ్చాక కొడుకు నిద్ర పోవడమే జరుగుతుందట. ఇలాంటి కష్టం కేవలం ఎన్.టి.ఆర్ మాత్రమే పడగలడని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news