ప్లాప్ ల దెబ్బకి పేరు మార్చుకున్న మెగా హీరో..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తన స్క్రీన్ నేం మార్చుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో సాయి ధరం తేజ్ చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ పరుగు సాంగ్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ అదిరిపోయింది. అయితే ఈ సాంగ్ లో సాయి తేజ్ అని పడటంతో సాయి ధరం తేజ్ తన స్క్రీన్ నేం మార్చుకున్నాడని తెలిసింది.

పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనళ్లుడు సాయి తేజ్ సుప్రీం తో హిట్ అందుకున్నాడు. తిక్క నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన తేజ్ ఐలవ్యూ వరకు వరుస ఫ్లాపులు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం చిత్రలహరి మీదనే సాయి తేజ్ అన్ని హోప్స్ పెట్టుకున్నాడు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలతో టాలెంట్ చూపించిన కిశోర్ తిరుమల చిత్రలహరితో తేజూకి హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శి నటిస్తున్నారు. ఈమధ్య రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి సినిమా మెగా హీరోకి హిట్ కళ తెస్తుందో లేదో చూడాలి.

Leave a comment