లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి ” విజయం వీడియో సాంగ్ “..!

ఏపిలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఎన్టీఆర్ పై వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికలే క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా వచ్చింది. ఈ సినిమా రెండు భాగాలుగా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు. అయితే కథనాయకుడు మంచి హిట్ అయినా..మహానాయకుడు మాత్రం భారీ డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడిని గొప్పగా చూపించారని..అది కొంత మంది జీర్ణించుకోలేక పోయారని టాక్ వచ్చింది.

ఇప్పుడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నిర్మించారు. ఈ సినిమా మొదటి నుంచి ఎన్నో కాంట్ర వర్సీలు సృష్టిస్తుంది. ఇందులో చంద్రబాబు ని నెగిటీవ్ గా చూపిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు కేసు కూడా పెట్టారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఏం చేయలేమని కోర్టు తేల్చి చెప్పింది. దాంతో ఈ సినిమా రిలీజ్ కి ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది.

ఈ సినినిమా మొదట 22 అనుకున్నా కొన్ని సెన్సార్ కార్యక్రమాల వల్ల 29 కి పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘విజయం విజయం ఘన విజయం… విజయం విజయం శుభసమయం… జయహో నాదం.. ఎదలో మోదం.. వదనాల వెలిగే హాసం… గుండెల్లో లోలోపల ఆనందం…’ అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విడుదల చేశారు. “నీలాంటి వ్యక్తిని పట్టుకుని ఎన్ని నిందలు మోపారు. వాళ్లందరికీ ఈ ఘనవిజయం ఓ గొప్ప చెంపదెబ్బ” అన్న ఎన్టీఆర్ డైలాగ్ కూడా వినిపిస్తోంది.

Leave a comment