కియరా మీద కన్నేసిన అక్కినేని హీరో..!

అక్కినేని హీరో అఖిల్ వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్నాడు. అయితే సినిమా సినిమాకు నటనలో పరిణితి సాధిస్తున్న అఖిల్ తన 4వ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో చేస్తున్నాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందట. బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ డైరక్టర్ ఫాంలో లేకున్నా సరే ఓకే చెప్పాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని తీసుకోవలని చూస్తున్నారట.

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వాని ఆ తర్వాత రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ లో నటిస్తున్న కియరా మరో రెండు తెలుగు సినిమాల్లో డిస్కషన్స్ చేస్తుందట. అఖిల్ తో కియరా జోడీ అదిరిపోయేలా ఉంది. బాలీవుడ్ లో ఇప్పటికే లస్ స్టోరీస్ అంటూ తన హాట్ అందాలతో అదరగొడుతున్న కియరా టాలీవుడ్ టాప్ చెయిర్ పై కన్నేసిందని చెప్పొచ్చు.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా హిట్టు టార్గెట్ తో తెరకెక్కిస్తున్నారట. మరి భాస్కర్ తో అఖిల్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో కియరా హీరోయిన్ అయితే ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.

Leave a comment