పవన్ డైలాగ్ తో ఎన్.టి.ఆర్ హంగామా..!

NTR Says pawan kalyan's dialogue

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఆదివారం జరుపుకున్నారు. చిత్రయూనిట్ సమక్షంలో జరిగిన ఈ సక్సెస్ మీట్ లో భాగంగా ఎన్.టి.ఆర్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది డైలాగ్ ప్రస్థావించడం జరిగింది.

12 ఏళ్ల నుండి మిత్రుడుగా ఉన్న త్రివిక్రం తో ఇన్నాళ్లకు సినిమా కల నెరవేరింది. తను నాకు మిత్రుడు, మా పిల్లలకు మామయ్య, నా భార్యకు అన్న, నాకు బావ ఇలా అన్ని త్రివిక్రం అన్నాడు ఎన్.టి.ఆర్. ఇక ఈ సినిమా కోసం తనకు ముందు రెండు కథలు వినిపించాడని కాని అంతకుమించి ఏదో కావాలని తానే మళ్లీ వేరే కథతో వస్తానని చెప్పాడని అన్నాడు.

ఈ సినిమా కోసం త్రివిక్రం కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించని యుద్ధం చేశానని డైలాగ్ లాగా ఆయనలో ఆయనే ఓ యుద్ధం చేశాడని చెప్పాడు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ఆ డైలాగ్ త్రివిక్రం రాసిందే కావడం విశేషం.

Leave a comment