Movies"నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రష్మి".. నెటిజన్ షాకింగ్ కామెంట్స్..ఏమైందంటే..?

“నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రష్మి”.. నెటిజన్ షాకింగ్ కామెంట్స్..ఏమైందంటే..?

యాంకర్ రష్మీ ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఎప్పటికప్పుడు తన సినిమాలకి సంబంధించి తన షూట్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది . తన లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటుంది . అంతేకాదు సమాజంలో ఎవరైనా సరే మూగజీవుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన .. హింసించిన వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది . అయితే తాజాగా యాంకర్ రష్మి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక వీడియో షేర్ చేసింది .

ఆ వీడియోలో ఒక వ్యక్తి ఎద్దును కాల్చి చంపుతూ ఉంటాడు. ఇది దారుణం అంటూ ఆ వ్యక్తిని తిడుతూ పోస్ట్ చేసింది. మనం ఇలాంటివి జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నాము అంటూ ప్రశ్నించింది . అయితే ఈ పోస్ట్ పై చాలా మంది పాజిటివ్ గా స్పందించారు . కొందరు నెగిటివ్గా కూడా స్పందించారు . మరియు ముఖ్యంగా ఒక వ్యక్తి ఏకంగా నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రష్మీ అంటూ అడగడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

:ఆడపిల్లలను రేప్ చేసేస్తున్నారు.. బట్టలు విప్పేసి నగ్నంగా తిప్పుతున్నారు ..చంపేస్తున్నారు.. దారుణాలకు పాల్పడుతున్నారు ..వాళ్ళ విషయంలో నువ్వు ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వవా? ఒక ఎద్దును చంపితేనే ఇలా మాట్లాడుతున్నావ్.. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి” అంటూ కామెంట్ పెట్టాడు . సోషల్ మీడియాలో ఈ కామెంట్ బాగా వైరల్ గా మారింది. ఆశ్చర్యం ఏంటంటే ఈ కామెంట్స్ పై రష్మీ గౌతం కూడా స్పందించింది . ఇవాళ ఎద్దును చంపిన వాడే.. రేపు మీ పిల్లలను కూడా చంపుతాడు ..వాడికి మనిషికి పసుపుకి తేడా తెలియదు ..బ్రెయిన్ వాడు అని గట్టిగా రిప్లై ఇచ్చింది . దీంతో రష్మి గౌతమ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news