అరవింద సమేతపై రామ్ చరణ్ కామెంట్..!

Ram charan comments about Aravindha sametha

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. త్రివిక్రం డైరక్షన్, ఎన్.టి.ఆర్ యాక్షన్ కు సిని అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా సక్సెస్ ను చిత్రయూనిట్ ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమా విజయం గురించి పలువురు సిని సెలబ్రిటీస్ తమ కామెంట్ తెలిపారు లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అరవింద సమేత సినిమా గురించి తన ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టాడు.

అరవింద సమేత సినిమాలో ఎన్.టి.ఆర్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. బోల్డ్ స్టోరీ, ఇంటెన్స్ డైరక్షన్, డైలాగ్స్ రాసిన త్రివిక్రం అదరగొట్టారని అన్నాడు. తమన్ మ్యూజిక్, జగ్గు భాయ్ పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయని అన్నాడు. ఎన్.టి.ఆర్ తో చరణ్ త్వరలో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడని తెలిసిందే. రాజమౌళి డైరక్షన్ లో ఆ సినిమా త్వరలో మొదలు కానుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో రాబోతుంది.

Leave a comment