Gossipsరోడ్డు పాలైన నర్తనశాల బయ్యర్లు...!

రోడ్డు పాలైన నర్తనశాల బయ్యర్లు…!

ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ శౌర్య ఆ తర్వాత నర్తనశాల అంటూ నిరాశ పరచాడు. తానేదో గొప్ప ప్రయోగం చేశాననటూ నర్తనశాల గురించి గొప్పలు చెప్పిన నాగ శౌర్య సినిమా ఫలితంతో మొహం చాటేస్తున్నాడట. ఛలో సినిమా డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కు కొద్దిపాటి లాభాలు తీసుకురాగా నర్తనశాల లాభ మాట పక్కన పెడితే అసలకే మోసం వచ్చేసింది.
3
నర్తనశాల సినిమా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయ్యింది. నాగ శౌర్య రేంజ్ కు అది ఎక్కువ అన్నట్టే. కాని ఛలోతో ఫాం లోకి వచ్చాడు కాబట్టి పర్వాలేదు అనుకున్నారు. అయితే నర్తనశాలను తక్కువ బడ్జెట్ లో తీసి ఎక్కువ మొత్తానికి అమ్మిన నిర్మాతలను నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ వెంటపడుతున్నారట. ఈ మేరకు నిర్మాతల మండలిలో కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.
2
సినిమా హిట్ అయితే వేరేలా ఉంటుంది కాని సినిమా అంచనాలను అందుకోకపోతే మాత్రం కచ్చితంగా నిర్మాతలకు ఇలాంటి కష్టాలు తప్పవు. కాశ్మీరా, యామిని భాస్కర్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్ట్ చేశారు.
1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news