‘దేవదాస్’ల పెగ్ ఎఫెక్ట్.. మత్తులో ‘నైజాం’!

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తున్నారని వార్త వెలువడినప్పుడే ఆ సినిమాపై బోలెడంత క్రేజ్ వచ్చిపడింది. ఇక టీజర్ రిలీజయ్యాక ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ఇద్దరూ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా ఫుల్ ఎంటర్టైన్ చేస్తారనే నమ్మకం ఏర్పడింది. దీంతో ట్రేడ్ వర్గాల్లో ఈ చిత్రం హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
4
ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం… ఏషియన్ ఫిల్మ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా నైజాం హక్కుల్ని అక్షరాల రూ.11.07 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది నిజంగా షాకింగ్ ఫిగర్! ఎందుకంటే… నాగ్, నానిలు పాపులర్ హీరోలైనప్పటికీ… మార్కెట్ పరంగా వారికంటూ ఒక పర్ఫెక్ట్ మార్జిన్ లేదు. చాలా అరుదుగా రూ.10 కోట్ల క్లబ్‌లో ఎంటరైన దాఖలాలున్నాయే తప్ప… మిగతా టైంలో కనీసం రూ.5-6 కోట్ల మార్జిన్‌ని కూడా దాటలేదు. అలాంటి వీరి మల్టీస్టారర్ చిత్రం రూ.11.07 కోట్ల ధర పలకడం విశేషమే! ట్రేడ్‌లో వున్న బజ్‌ని బట్టే ఈ చిత్రానికి నైజాంలో ఇంత గిరాకీ వచ్చి వుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి.. రిలీజయ్యాక అంత మొత్తాన్ని రికవర్ చేయగలుగుతుందా? లేదా? వేచి చూడాలి.
1
కాగా… నాగార్జున ఇందులో అండర్‌వరల్డ్ డాన్‌గా కనిపిస్తుండగా, నాని డాక్టర్‌గా నటిస్తున్నాడు. రష్మిక మందన్నా, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని యువదర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.3

2

Leave a comment