కన్ఫర్మ్.. తారక్‌‌ను వెనక్కి నెట్టేసిన సీనియర్ హీరో..

69

టాలీవుడ్ బుల్లితెరపై ఎన్ని రియాలిటీ షోలు వచ్చినా బిగ్ బాస్‌కు ఉన్న క్రేజ్ వేరు. బాలీవుడ్ బుల్లి తెరను షేక్ చేసిన ఈ షో ఎలాంటి టీఆర్‌పీ రేటింగ్‌లు సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక అదే ఫార్ములాను తెలుగు బుల్లితెరపై రిపీట్ చేయాలనే ఉద్దేశ్యంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను హోస్ట్‌గా చేస్తూ స్టార్ మా ఛానల్‌లో ప్రసారమైన బిగ్ బాస్ తొలి సీజన్ అంచనాలు నిజం చేస్తూ అదిరిపోయే టీఆర్‌పీతో దుమ్ములేపింది.

మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో వెంటనే రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నానితో ప్లాన్ చేశారు. ఈ సీజన్ పాపులర్ కావడానికి వివాదాలే కారణమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో తన జీవితంలో మళ్లీ రియాలిటీ షో అనేది చేయను బాబోయ్ అని డిసైడ్ అయ్యడు నాని. కాగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3కి వ్యాఖ్యాతగా ఎవరు ఉంటారా అని తెలుగు ప్రేక్షకులు గతకొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ 3ని మరోసారి తారక్ హోస్ట్ చేయబోతున్నాడని.. స్టార్ హీరో వెంకటేష్ బిగ్ బాస్‌ను హోస్ట్ చేసేందుకు రెడీ అయ్యాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అవేమీ నిజం కాదని తేలిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ 3ని హోస్ట్ చేసేందుకు స్టార్ హీరో నాగార్జున ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుంది.

జూలై నెలలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా నాగార్జున టీఆర్‌పీ రేటింగ్‌లే ధ్యేయంగా దూసుకుపోతాడని నిర్వాహకులు తెలిపారు. ఏదేమైనా తారక్‌ను కాదని.. నాగ్‌తో బిగ్ బాస్ 3ని చేస్తున్న స్టార్ మాకు ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు తెలుగు ఆడియెన్స్.

Leave a comment