తారక్ టైటిల్‌ను కొట్టేసిన బాలయ్య..

నందమూరి బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల దెబ్బకు కొంచెం గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. అటు రాజకీయ పరంగా ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు మరోసారి మేకప్ వేసుకోడానికి రెడీ అయ్యాడు. తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య.

అయితే ఈ సినిమాకు టైటిల్‌గా తారక్ సినిమాలోని ఓ పేరును వాడుతున్నాడు బాలయ్య. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దమ్ము’ సినిమా అప్పట్లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసింది. ఈ సినిమా ఘోర పరాజయాన్ని చూసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ‘రూలర్’ అనే సాంగ్ బాగా ఆకట్టుకుంది. అయితే సినిమా ఫెయిల్ కావడంతో ఆ పాట ఉందనే విషయం కూడా మర్చిపోయారు జనాలు. ఇప్పుడు మరోసారి రూలర్ అనే మాటను మనకు గుర్తుకు తెస్తున్నాడు బాలయ్య.

తన నెక్ట్స్ మూవీకి రూలర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుండటంతో బాలయ్య పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

Leave a comment