స్టార్ హీరోయిన్ కూతురితో… నిజమే అంటున్న కుర్ర హీరో..!

ఫిలిం ఇండస్ట్రీలో సెలెబ్రిటీలు మాత్రమే కాకుండా వారి పిల్లలు కూడా ఎప్పుడూ ఏదో ఒక వార్తలో హల్ చల్ చేస్తుంటారు. ఇక సెలెబ్రిటీల పిల్లలైతే వారిపై ఎప్పుడూ ఏదో ఓ వార్తతో సోషల్ మీడియా బిజీ బిజీగా ఉంటుంది. ఈ తంతు బాలీవుడ్‌లోనైతే కాస్త ఎక్కువే అని చెప్పాలి. అక్కడ స్టార్ కిడ్స్‌పై రూమర్స్ ఓ రేంజ్‌లో ఉన్నా.. వాటిని పెద్దగా పట్టించుకోరు. ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి తన కెరీర్‌లో ఎలాంటి రూమర్లకు తావివ్వలేదు. కానీ ఆమె పల్లలపై మొదట్నుండీ ఏదో ఓ వార్త వస్తూనే ఉంది.

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినిమా అరంగేట్రం చేయక ముందే తన స్నేహితుడు ఇషాన్ ఖత్తర్‌తో రిలేషన్‌లో ఉందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వారిద్దరూ తమ మొదటి సినిమాలో కలిసి నటించడం.. ప్రైవేట్ పార్టీలకు, డిన్నర్ డేట్‌లకు కలిసి తిరగడంతో వారి మధ్య రిలేషన్ కొనసాగుతోందని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీనిపై వారిద్దరు స్పందించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇటీవల ఓ టాక్ షోలో ఇషాన్‌ను ఇదే విషయంపై అడగటంతో.. తాము ఓ మంచి రిలేషన్‌లో ఉన్నామంటూ ఒప్పేసుకున్నాడు. అయితే అది ఖచ్చితంగా డేటింగ్ అని మాత్రం మనోడు ఒప్పుకోలేదు.

ఇక స్టార్ కిడ్స్‌కు ఇలాంటి రిలేషన్‌లు కొత్తేమీ కాదంటున్నారు బాలీవుడ్ వర్గాలు. నచ్చినన్ని రోజులు కలిసి మెలిసి జీవించి, మనస్పర్థలు రాగానే విడిపోవడం చాలా కామన్ అని తీసిపడేస్తున్నారు. ఏదేమైనా శ్రీదేవి కూతురు ఇలా కెరీర్‌ బిగినింగ్‌లోనే రూమర్లకు తావివ్వడం అంత మంచిది కాదంటున్నారు శ్రీదేవి ఫ్యాన్స్.

Leave a comment