కోరుకున్న అమ్మాయి మరొకరితో కులుకుతోందని తెలిసి.. ఆరుగురిని అడ్డంగా కాల్చి చంపిన కసాయి

Man fired a prostitute in brazil

A man killed 6 members including with a prostitute. Read below article to know more details

ఇదో దారుణమైన ఘటన. తాను కోరుకున్న అమ్మాయి ఆల్రెడీ మరొకరితో కులుకుతోందని తెలిసి ఓ కామాంధుడు తట్టుకోలేకపోయాడు. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఆ అమ్మాయి ఇప్పటికిప్పుడు కావాల్సిందేనని పట్టుబడ్డాడు. కానీ.. వ్యభిచారగృహ నిర్వాహకులు కుదరదని చెప్పడంతో.. తన వెంట తెచ్చుకున్న రివాల్వర్‌తో నలుగురిని కాల్చేశాడు. ఆ తర్వాత అమ్మాయితోపాటు మరొకరిని కూడా కాల్చేశాడు. చివరికి అక్కడినుంచి పరారయ్యాడు. ఈ దారుణమైన ఘటన దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వ్యభిచారగృహంకి వెళ్ళడానికి అలవాటుపడ్డ ఒక వ్యక్తి, అక్కడ ఓ యువతిని ఎంపిక చేసుకున్నాడు. నిత్యం ఆమెతోనే శృంగారం చేయడం అలవాటుగా చేసుకున్నాడు. అందమైన యువతులు ఎందరో ఉన్నప్పటికీ.. అతగాడు మాత్రం ఆ అమ్మాయితోనే శృంగారం చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ క్రమంలోనే అతగాడికి మూడొచ్చి ఆ యువతితో రొమాన్స్ చేసేందుకు బ్రోతల్ హౌస్‌కి వెళ్ళాడు. అయితే.. అప్పటికే ఆ అమ్మాయి మరొక వ్యక్తితో బిజీగా ఉందని ఆ బ్రోతల్ హౌస్‌ని నడిపే నిర్వాహకుడు చెప్పాడు. ఆ మాట విని ఊగిపోయిన ఆ వ్యక్తి.. వెంటనే తాను కోరిన అమ్మాయినే తనకోసం ఏర్పాటు చేయాలని గట్టిగా వారించడం మొదలుపెట్టాడు. నిర్వాహకులు కుదరదని ఎంత చెప్పినా.. అతడు వినలేదు.

చివరికి అతని కోపం కట్టలు తెంచుకుంది. దాంతో.. అతడు నేరుగా కారు వద్దకు వెళ్ళి, అందులో ఉన్న రివాల్వర్ తీసి, నేరుగా తను శృంగారం చేయదలచుకున్న యువతి గది వద్దకు వెళ్ళాడు. ఆమెని గదిలోంచి బయటకు లాక్కొచ్చి.. రివాల్వర్‌తో కాల్చి చంపేశాడు. ఆమెతో శృంగారం చేస్తున్న మరో నలుగురిని కూడా చంపాడు. అడ్డొచ్చిన మరో వ్యక్తిపై కూడా కాల్పులు జరిపాడు. దాంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో భయపడ్డ ఇతర వ్యభిచారిణిలందరూ అక్కడి నుంచి పరుగులు తీశారు. నిందితుడు కూడా పరారయ్యాడు. చివరికి తనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి లొంగిపోయాడు.

Leave a comment