ఈ ఏడాది యూఎస్ఏలో కలెక్షన్ల వర్షం కురిపించిన టాప్-10 తెలుగు సినిమాలు ఇవే!

Top 10 Grossing telugu films at USA box office in 2016

The list of top 10 highest grossing Telugu films at USA box office in 2016. In this list A aa is in first place with more that 2.4 million dollars. Pelli Choopulu is the highest profitable film this year which is at seventh place. check out the list below.

ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాల్లో చాలావరకు మంచి విజయాలే సాధించాయి. భారీ క్రేజ్ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు అతిపెద్ద డిజాస్టర్లుగా నిలవగా.. మరికొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. బాక్సాఫీస్ ఓ ఆటాడుకున్నాయి. కానీ.. యూఎస్‌లో మాత్రం కొన్ని సినిమాలే తమ సత్తా చాటుకుని.. టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. ఆ మూవీలేంటో, అవి ఎంతమొత్తం అమెరికా బాక్సాఫీస్ వద్ద రాబట్టాయోనన్న వివరాలు క్రింది తెలుపబడ్డాయి.

1. అ.. ఆ : $2,44,5037 (బ్లాక్ బస్టర్)
2. నాన్నకు ప్రేమతో : $20,19,418 (సూపర్ హిట్)
3. జనతా గ్యారేజ్ : $1,800,280 (హిట్)
4. ఊపిరి : $1,569,562 (సూపర్ హిట్)
5. 24(తెలుగు+తమిళ్) : $1,470,761 (సూపర్ హిట్)
6. ధృవ : $1,361,112 (యావరేజ్)
7. పెళ్లిచూపులు : $1,198,393 (బ్లాక్ బస్టర్)
8. బ్రహ్మోత్సవం : $1,156,306 (ఫ్లాప్)
9. సర్దార్ గబ్బర్ సింగ్ : $1,001,000 (ఫ్లాప్)
10. జెంటిల్ మెన్ : $907,635 (సూపర్ హిట్)

పైన తెలుపబడిన జాబితాలో ‘బ్రహ్మోత్సవం’, ‘సర్దార్ గబర్ సింగ్’ సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. అవి తెలుగు రాష్ట్రాల్లోనే యూఎస్ బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేస్తాయని భావించారు. ఆ క్రేజ్ కారణంగానే భారీ స్థాయిలో బిజినెస్ చేశాయి. కానీ.. డిజాస్టర్ టాక్ రావడంతో భారీ నష్టాలు మిగిల్చాయి. అయితే.. మిలియన్ డాలర్ క్లబ్‌లో మాత్రం సునాయాసంగా చేరిపోయాయి. ఆ ఇద్దరి హీరోలకున్న క్రేజ్ కారణంగానే వారి సినిమాలు ఆ ఫీట్‌ని అందుకోగలిగాయి.

ఇక మిగిలిన సినిమాల్లో ‘అ..ఆ’,‘పెళ్లిచూపులు’ అనూహ్య కలెక్షన్లు రాబట్టాయి. ఈ రెండు సినిమాల రైట్స్‌ని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు చాలా తక్కువ రేట్లకు సొంతం చేసుకోగా.. అవి విపరీతమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. దీంతో.. అంచనాలకు మించే పంపిణీదారులకు కోట్లలో లాభాలు వచ్చాయి. ఇక మిగిలిన సినిమాలు అంచనాలకు తగ్గట్టే వసూళ్లు రాబట్టి.. డిస్ట్రిబ్యూటర్స్‌ని సేఫ్ జోన్‌లో పడేశాయి.

Leave a comment