‘వంగవీటి’ యూఎస్ఏ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..

vangaveeti 3 days usa collections ram gopal varma

USA trade reports revealed the first weekend collections report of Ram Gopal Varma’s latest sensation Vangaveeti which is based on Vangaveeti Radha’s life.

సాధారణంగానే వర్మ సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఎలాంటి ఆదరణ లభించు. బూతు కంటెంట్, యాక్షన్ ఎలిమెంట్స్ ఓవర్‌గా ఉండటమే అందుకు కారణం! తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘వంగవీటి’ సినిమా కూడా కేవలం యాక్షన్‌తోనే నిండి ఉండడంతో.. అంతంత మాత్రమే వసూళ్లు వస్తున్నాయి. పైగా.. ఈ మూవీకి మిశ్రమ టాక్ రావడం వల్ల అంచనాలకంటే తక్కువగానే కలెక్షన్స్ వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక యూఎస్ఏలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫస్ట్ వీకెండ్ మొత్తంలో కేవలం 50 వేల డాలర్లకు పైన మాత్రమే రాబట్టింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం యూఎస్ఏలో తొలిరోజు $35,728 కలెక్ట్ చేసింది. మిక్స్ టాక్ రావడంతో.. రెండోరోజు వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. కేవలం $10,452 మాత్రమే ఈ సినిమా వసూలు చేసింది. ఇక ఆదివారం కూడా అదే బాపతు. కాకపోతే.. కలెక్షన్లలో కాస్త పురోగతి వచ్చింది. $11,216 కలెక్ట్ రాబట్టినట్లు ట్రేడ్ లెక్కలు పేర్కొన్నాయి. అంటే.. ఫస్ట్ వీకెండ్‌లో ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద $57,396 గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ కావడం వల్లే ఇలా తక్కువ వసూళ్లు రాబట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.

రోజులవారీగా యూఎస్ఏ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ :
శుక్రవారం : $35,728
శనివారం : $10,452
ఆదివారం : $11,216
టోటల్ గ్రాస్ : $57,396

Leave a comment