మహర్షి ఫస్ట్ డే కలెక్షన్స్.. నాన్ బాహుబలి రికార్డుల పాతర..

65

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి నిన్న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మంచి హైప్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్‌ రికార్డులకు పాతర వేస్తోంది. తొలి రోజే అదిరిపోయే కలెక్షన్లతో కొన్ని ఏరియాలో ఆల్‌టైమ్ రికార్డులు సాధిస్తూ నాన్ బాహుబలి రికార్డులకు ఎసరు పెడుతోంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మహర్షి క్రియేట్ చేస్తున్న సునామీ మామూలుగా లేదు. నిజం లాంటి ఏరియాల్లో ఇది ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో మహర్షి ఏకంగా రూ.24.18 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టింది. ఇక తొలి వీకెండ్‌లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తు్న్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఏరియాల వారీగా ఈ చిత్ర ఫస్ట్ డే కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – ఫస్ట్ డే కలెక్షన్లు(కోట్లలో)
నిజాం – 6.38 కోట్లు
సీడెడ్ – 2.45 కోట్లు
వైజాగ్ – 2.88 కోట్లు
ఈస్ట్ – 3.20 కోట్లు
వెస్ట్ – 2.46 కోట్లు
కృష్ణా – 1.34 కోట్లు
గుంటూరు – 4.40 కోట్లు
నెల్లూరు – 1.01 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 24.18 కోట్లు

Leave a comment