తప్పతాగిన మహర్షి బ్యూటీ.. పోలీసు కేసుకు రెడీ..!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మహర్షి ఫీవర్ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భారీ అంచనాల నడుమ రిలీజయిన ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అమ్మడి పాత్రకు మంచి రెస్పాన్స్ రావడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఆమెపై సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది.

స్టార్ హీరోయిన్లపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ రావడం పక్కా. అయితే పూజాపై ఎఫైర్లకు సంబంధించిన రూమర్ ఏమీ రాలేదు కానీ.. అమ్మడు తప్పతాగి పోలీసులకు చిక్కినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహర్షి ప్రీరిలీజ్ ఈవెంట్ రోజున అమ్మడు తప్పతాగి కారు నడిపి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిందని తెలుస్తోంది. అయితే ఆమె మేనేజర్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. పూజాకు ట్రాఫిక్‌లో కారు నడపడం అస్సలు ఇష్టం ఉండదని ఆయన తెలిపారు. ఆ రోజు కూడా పూజాను డ్రైవర్ డ్రాప్ చేసినట్లు అతడు తెలిపాడు.

ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. పూజాపై రూమర్లు క్రియేట్ చేసిన వారిపై పోలీసు కేసు పెట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఏదేమైనా స్టార్ సెలిబ్రిటీలపై గాలి వార్తలు రావడం కామన్ అంటున్నారు సినీ జనాలు.

Leave a comment