ఓ కుర్ర హీరోతో పనికానిచ్చేస్తున్న F2 బ్యూటీ..

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. అలాగే అవకాశాలు ఉన్నప్పుడే అందినకాడికి సంపాదించాలి అంటారు సెలెబ్రిటీలు. అయితే హిట్స్ ఉన్నంతసేపే ఈ అవకాశాలు వస్తాయని వారికి తెలియదు. ఎంత క్రేజ్ ఉన్న మనలో విషయం లేకపోతే అవకాశాలు దరిదాపులకు రావు. ఇప్పుడు ఇదే జరుగుతోంది ఓ హీరోయిన్ విషయంలో. ఇటీవల F2 సినిమాతో మంచి హిట్ అందుకున్న బ్యూటీ మెహ్రీన్‌కు యాక్టింగ్‌లో అంత పట్టు లేకపోవడంతో పాపం ఈ బ్యూటీకి అవకాశాలు రావడమే లేదు.

F2 సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయినా అమ్మడికి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేతిలో పడలేదు. దీనికి కారణం ఏమిటంటే ఆమె డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. అమ్మడు ఒక్క సినిమాకు ఏకంగా రూ.75 లక్షలు వసూలు చేస్తుండటంతో నిర్మాతలు ఆమెతో సినిమా చేయాలంటే జంకుతున్నారు. కాగా చేసేది ఏమీ లేక వచ్చినవారితోనే సినిమాలు చేసేందుకు ఓకే చెబుతోంది ఈ బ్యూటీ. యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తోన్న ఓ కొత్త సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ను సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్.

ఇక చేసేది ఏమీ లేక వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక.. నాగశౌర్యతో సినిమాకు ఓకే చెప్పింది ఈ బ్యూటీ. మరి ఈ సినిమాతోనైనా అమ్మడికి అవకాశాలు ఎక్కువగా వస్తాయో లేదో చూడాలి అంటున్నారు సినీ జనాలు.

Leave a comment