ఇలియానా మోజులో ఆ డైరక్టర్..?

157

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న గోవా బ్యూటీ ఇలియానా బర్ఫీ సినిమా ముందువరకు తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకోగా ఆ తర్వాత బాలీవుడ్ కు అంకితమైంది. అక్కడ స్టార్ స్టేటస్ అందుకోవాలని చూసిన అమ్మడికి నిరాశే మిగిలింది. ఫైనల్ గా మళ్లీ తెలుగు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఇలియానా. లాస్ట్ ఇయర్ రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఇల్లి బేబ్ మళ్లీ మరోసారి తెలుగు ఛాన్స్ అందుకుంది.

శ్రీను వైట్ల డైరక్షన్ లో మంచు విష్ణు హీరోగా వస్తున్న ఢీ 2లో హీరోయిన్ గా ఇలియానా నటిస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ అమర్ అక్బర్ ఆంటొని ఛాన్స్ ఇచ్చిన శ్రీను వైట్ల మళ్లీ అమ్మడినే ఈ సినిమాలో తీసుకోవడం హాట్ న్యూస్ గా మారింది. మంచు విష్ణు కెరియర్ లో సూపర్ హిట్టైన ఢీ సీక్వల్ తో మళ్లీ అలాంటి సూపర్ హిట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు.

అమర్ అక్బర్ ఆంటొనిలో ఇలియానా నటించినా ఆమె మునుపటిలా మెప్పించలేదు. కాస్త లావెక్కినట్టు అనిపిస్తున్నా ఈసారి తనలోని హాట్ యాంగిల్ ను ఢీ 2లో బయట పెట్టాలని చూస్తుందట. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ఇల్లి బేబ్ కు ఇప్పుడు అవకాశాలు ఇచ్చే వారు కరువయ్యారు. మరి విష్ణుతో ఇలియానా రొమాన్స్ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఆల్రెడీ ఈ ఇద్దరు సలీం సినిమాలో నటించారు.

Leave a comment