అబ్బాయితో నిజమే అంటున్న ఆంటీ.. కానీ.?

బాలీవుడ్‌లో ఎఫైర్‌లకు కొదవే లేదని వాస్తవం. స్టార్ స్టేటస్ ఉన్న హీరోల నుండి చిన్నాచితక హీరోల వరకు దీన్ని ఆనవాయతీగా పాటిస్తుంటారు. అయితే హీరోలతో పాటు అక్కడి భామలు కూడా ఈ కల్చర్‌ను ఫాలో అవుతున్నారు. ఇది ఎంతలా పెరిగిందంటే.. ఎఫైర్‌ల కోసం తమ పార్ట్‌నర్‌కు విడాకులు ఇచ్చి మరీ తమ ఎఫైర్‌లు కొనసాగిస్తున్నారు. వీరిలో ముందు వరుసలో ఉండేది ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే జోడీ మలైకా అరోరా అండ్ అర్జున్ కపూర్.

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా తనకంటే 13 ఏళ్ల చిన్నోడైన అర్జున్ కపూర్‌తో కొన్నేళ్లుగా ఎఫైర్ సాగిస్తోంది. వీరి మధ్య బంధం ఎంతలా ఉందంటే ఇటీవల తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు కూడా దిగుతున్నారు. అయితే బాలీవుడ్ వర్గాలు వీరు త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ఏప్రిల్ 19న వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై మలైకాను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. అదేం లేదు.. పెళ్లి పై వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అనే తేల్చేసింది. అయితే అర్జున్‌తో తన ఎఫైర్ గురించి మాత్రం పెద్దగా రెస్పాన్స్ ఇవ్వలేదు ఈ ఆంటీ.

ఏదేమైనా ఇండియాకు ఉన్న సమస్యల్లో ఈ సమస్య తీరాలంటే వీరిద్దరు పెళ్లి చేసుకోవాల్సిందే అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. మరి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి అంటున్నారు బాలీవుడ్ జనాలు.

Leave a comment