Movies"హలో గురు ప్రేమ కోసమే " మంచి రొమాంటిక్ ఫీల్...

“హలో గురు ప్రేమ కోసమే ” మంచి రొమాంటిక్ ఫీల్ గుడ్ టీజర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. రామ్, అనుపమ జంటగా నటిస్తున్న ఈ టీజర్ లో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుందని హింట్ ఇచ్చాడు దర్శకుడు త్రినాథ రావు.

సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న త్రినాథ రావు దిల్ రాజు కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే. నాగార్జున టైటిల్ తో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో రామ్ లుక్ ఆకట్టుకుంది. ఇక త్రినాథ రావు మార్క్ డైలాగ్ పంచ్ కూడా అదిరిపోయింది. మరి టీజర్ కూల్ గా ఇంప్రెస్ చేయగా దసరా బరిలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news