మరోసారి అడ్డంగా బుక్కైన నయన్..

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నడిపించే ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. డైరెక్ట్ గా చెప్పినా చెప్పకున్నా సరే ఇద్దరు ప్రేమ పరవశంలో మునిగి తేలుతున్నారన్నది వాస్తవం. ఇక ఈ ప్రేమ జంట వెకేషన్ లో దిగిన పిక్స్ చూస్తే వ్యవహారం చాలా దూరం వెళ్లినట్టు అనిపిస్తుంది.

ప్రస్తుతం విఘ్నేష్ శివన్, నయనతారలు అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ దర్శనార్ధం వెళ్లారట. అక్కడ ఇద్దరూ దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. డేటింగ్ వ్యవహారం మొదట సీక్రెట్ గా ఉంచిన ఈ జంట ఇప్పుడు అంతా ఓపెన్ అంటూ వెళ్లిన ప్రతి చోట ఫోటోలు దిగడం ఆ పిక్స్ తమ సోషల్ బ్లాగ్ లో పెట్టడం చేస్తున్నారు.

ఓ పక్క కెరియర్ లో సూపర్ ఫాం లో ఉన్న నయనతార విఘ్నేష్ తో నడిపిస్తున్న ఈ ప్రేమాయణానికి శుభం కార్డ్ ఎప్పుడు వస్తారో అని ఆమె ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి నయన్, విఘ్నేష్ ల ప్రేమ పెళ్లి ఎప్పుడు ఎక్కడ అన్నది వారిద్దరి చెబితేనే తెలుస్తుంది.
1

Leave a comment