చీకటి గదిలో చితక్కొడతానంటున్న తెలుగు పాప..

127

తెలుగు హీరోయిన్లు టాలీవుడ్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. వీరిలో చాలా మంది ఫేడ్ అవుట్ కాగా.. అరకొర ఆఫర్లతో మరికొంత మంది కెరీర్‌ను నెట్టుకొస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇషా రెబ్బ కూడా ఒకరు. ‘అంతకు ముందు ఆ తరువాత’ వంటి సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్న ఇషా.. కెరీర్‌ను విజయవంతంగా మార్చడంలో సక్సెస్ కాలేదు. దీంతో వచ్చిన ఆఫర్లు చేసుకుంటూ వెళ్తోంది.
3
అయితే తాజాగా అమ్మడు చీకటి గదిలో చితక్కొడతానంటోంది. అవును.. ఇప్పటివరకు ఇషా చేయని హార్రర్ జోనర్ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. ఢమరుకం చిత్ర డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో త్వరలో రాబోయే సినిమాలో ఇషా లీడ్ రోల్ చేయనుంది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ హార్రర్ జోనర్‌కు చెందినదిగా దర్శకుడు తెలిపారు. ఇషా ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది.
2
ఏదేమైనా హార్రర్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు ఇషా కూడా అదే దారిలో ప్రయాణించేందుకు సిద్ధమైంది. అయితే హార్రర్ సినిమాలో అమ్మడు ఎంతమేర మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. మొత్తానికి చీకటి గదిలో ఇషా ఎలా చితక్కొడుతుందో చూడాలి.
1

Leave a comment