నిహారికా ‘సూర్యకాంతం’ మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా: సూర్యకాంతం
దర్శకుడు: ప్రణీత్ బ్రమండపల్లి
నిర్మాత: సృజన్ యరబోలు, సందీప్ యెర్రంరెడ్డి
సంగీతం: మార్క్ కె రాబిన్
నటీనటులు: నిహారికా కొణిదెల, రాహుల్ విజయ్, పర్లీన్, సుహాసిని తదితరులు

మెగా డాటర్ నిహారికా నటించిన లేటెస్ట్ మూవీ సూర్యకాంతం మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సూర్యకాంతం ట్రైలర్‌ సినిమా అంచనాలను అమాంతం పెంచేసింది. రాహుల్ విజయ్ హీరోగా నిహారికా, పర్లీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా అంచనాలను ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.
3
కథ:
అల్లరి కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ విజయ్ పెళ్లిచూపులకు వెళ్తాడు. అక్కడ పర్లీన్‌ను చూసిన రాహుల్ ఆమెను ఇష్టపడతాడు. కుటుంబ సభ్యులు కూడా వారికి ఓకే చెబుతారు. కట్ చేస్తే.. సుహాసిని కూతురుగా నిహారికా ఎంట్రీ ఇస్తుంది. రాహుల్ విజయ్‌కు సుహాసిని మధ్య ఫ్లాష్ బ్యాక్ ఉండటంతో నిహారికా మళ్లీ రాహుల్ జీవితంలోకి వస్తుంది. కట్ చేస్తే.. పర్లీన్‌, రాహుల్‌ల ఎంగేజ్‌మెంట్ జరిగిన తరువాత నిహారికా కారణంగా వారి మధ్య విభేదాలు వస్తాయి. ఇంతకీ రాహుల్‌, నిహారికాల మధ్య సంబంధం ఏమిటీ..? సుహాసినికి రాహుల్‌తో ఎలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది..? రాహుల్ చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనేది మిగతా స్టోరీ.

విశ్లేషణ:
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సూర్యకాంతం సినిమా కథ రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఫస్టాఫ్ మొత్తం రాహుల్, పర్లీన్‌ల మధ్య నడిచే ట్రాక్‌ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంది. అయితే మాస్ ఎంట్రీతో నిహారికా చాలా కొత్తగా కనిపించింది. రాహుల్‌ జీవితంలోకి మళ్లీ వచ్చిన నిహారికా అతడిని ఇబ్బంది పెట్టే సన్నీవేశాలు.. మధ్యలో వచ్చే కామెడీ సీన్స్‌‌తో ఫస్టాఫ్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది.
2
సెకండాఫ్‌లో ఎమోషన్‌కు పెద్దపీఠ వేస్తూ నిహారికా, రాహుల్ విజయ్, పర్లీన్‌ల మధ్య సాగే కథ బాగుంది. నిహారికా ఫ్లాష్ బ్యాక్.. రాహుల్‌తో ఆమె చేసే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుండటంతో సినిమా సుఖాంతంగా ముగుస్తుంది. ఓవరాల్‌గా చూస్తే.. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సూర్యకాంతం సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

నటీనటుల పర్ఫార్మెన్స్:
సూర్యకాంతం పాత్రలో నిహారికా అద్భుతంగా నటించింది. మాస్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రలో ఇంతకుముందు ఎప్పుడూ చేయని నిహారికా ఈ సినిమాలో తనదైన మార్క్‌తో ఆకట్టుకుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో రాహుల్ విజయ్‌‌ బాగా నటించాడు. మరో హీరోయిన్‌గా పర్లీన్ నటన కూడా బాగుంది. మిగతా నటీనటులు వారి పరిధిమేర బాగా నటించారు.
1
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కథను ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా తీర్చిదిద్దిన దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. సినిమాను ఎక్కడా బోర్ కొట్టించకుండా కామెడీతో అలరించిన విధానం బాగుంది. దర్శకుడు సింపుల్ కథను ఆసక్తికరంగా చూపించిన విధానం సూపర్. అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్లు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. మార్క్ కె రాబిన్ సంగీతం రిఫ్రెషింగ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగుండటంతో సినిమా రిచ్‌గా కనిపిస్తుంది.

చివరగా:
సూర్యకాంతం – కామెడీతో ఇంప్రెస్ చేసిన నిహారికా

రేటింగ్: 3.0/5

Leave a comment