Gossipsఅరవింద సమేత ని టెన్షన్ పెడుతున్న లీక్ (వీడియోస్)

అరవింద సమేత ని టెన్షన్ పెడుతున్న లీక్ (వీడియోస్)

ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం మొదటిసారి చేస్తున్న సినిమా అరవింద సమేత. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా వచ్చింది. ఇక స్టార్ సినిమా అంటే అభిమానుల ఎక్సైట్ మెంట్ తెలిసిందే. అందులో భాగంగానే సెట్స్ మీద ఉన్న సినిమా నుండి లీకుల పట్ల ఆసక్తి చూపుతారు.

సినిమాకు పనిచేస్తున్న యూనిట్ సభ్యులలో ఎవరో ఒకరు ఈ లీకులు చేస్తారు. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న అరవింద సమేత సినిమా నుండి ఓ క్రేజీ పిక్ లీక్ అయ్యింది. ఎన్.టి.ఆర్ లాల్చి పైజామా లుక్ లో కనిపించాడు. లీకిన పిక్ స్పెషల్ గా లేకున్నా ఎన్.టి.ఆర్ సినిమా లీకులను మాత్రం ఆపలేకపోతున్నారు.

పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా లీకుల విషయంలో చిత్రయూనిట్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news