Moviesటిల్లు స్క్వేర్ ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్సాఫీస్‌ను మడతపెట్టేసిన టిల్లన్న..మొత్తం ఎన్ని...

టిల్లు స్క్వేర్ ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్సాఫీస్‌ను మడతపెట్టేసిన టిల్లన్న..మొత్తం ఎన్ని కోట్లు అంటే..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకి సంబంధించిన టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో బాక్సాఫీస్ ని షేక్ర్ చేసిన డిజే సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే . రెండేళ్ల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ డిజే టిల్లు కు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది .

ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుతున్న సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 23.7 కోట్ల వసూళ్లను రాబటిన్నట్లు సమాచారం అందుతుంది . అంతేకాదు రానున్న రెండు రోజుల్లో వీకెండ్ కావడంతో ఈ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు . మలయాళీ భామ అనుపమ పరమేశ్వరణ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను మల్లిక్ రాం తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశాడు.

ఈ సినిమాకి మెయిన్ హైలెట్ సిద్దు జొన్నలగడ్డ పర్ఫామెన్స్ . ఇరగదీసాడు. రామ్ మిరియాల సాంగ్స్ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పాలి . ఒక సాదాసీదా సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే మామూలు విషయం కాదు . అది కూడా సిద్ధూ జొన్నలగడ్డకు పెద్దగా మార్కెట్ లేదు . స్టార్ హీరో అని కూడా చెప్పలేం అలాంటి హీరో ఏకంగా మొదటి రోజు 23 కోట్లు కలెక్ట్ చేశాడు అంటే కచ్చితంగా ఆ హీరోలో అంతో ఇంతో మేటర్ ఉందని చెప్పాలి . దీంతో సోషల్ మీడియాలో టిల్లు స్క్వేర్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.చూద్దాం రానున్న రోజుల్లో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news